For Money

Business News

కరెక్షన్‌ పూర్తయినట్లే?

నిఫ్టి ఇవాళ గరిష్ఠ స్థాయిలో క్లోజ్‌ కావడంతో… మార్కెట్‌లో ఇపుడున్న కరెక్షన్‌ పూర్తయినట్లేనని టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ నెలలో ప్రారంభమైన డౌన్‌ట్రెండ్‌లో భాగంగా నిఫ్టి ఈనెల 7వ తేదీన 24,795 కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తరవాతి రోజు అంటే ఈనెల 8వ తేదీన నిఫ్టి ఆరోజు గరిష్ఠ స్థాయి వద్ద క్లోజైంది. ఆ తరవాత ఇప్పటి వరకు నిఫ్టి ఎపుడూ ఇంత పటిష్ఠంగా క్లోజ్‌ కాలేదు. ఇవాళ రియాల్టి, ఐటీ, బ్యాంక్‌ షేర్లలో వచ్చిన ర్యాలీ చూస్తుంటే మార్కెట్‌లో ప్రస్తుత కరెక్షన్‌ పూర్తయినట్లేనని అనలిస్టలు అంటున్నారు. సాధారణంగా మార్కెట్‌లో బ్యాంకు షేర్లు పెరిగితే ఐటీ షేర్లు పడటం లేదా ఐటీ పెరిగితే బ్యాంకు షేర్లు పడటం సహజంగా కొనసాగుతున్న ట్రెండ్‌. దీనికి భిన్నంగా ఇవాళ ఐటీతో పాటు బ్యాంకు షేర్లు కూడా భారీ లాభాల్లో ముగివాయి. ఈ రెండు సూచీలు ఇవాళ నిఫ్టికి అండగా నిలబడ్డాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో స్ట్రాంగ్‌ ర్యాలీ కన్పిస్తోందని అనలిస్టులు అంటున్నారు. చాలా మంది అనలిస్టులు, బ్రోకర్లు మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు. టీసీఎస్‌ కంపెనీ బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో బాగా రాణించింది. దీంతో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగాలకు సేవలు అందిస్తున్న ఎంఫసిస్‌, పర్సిస్టెంట్‌ వంటి కంపెనీల షేర్లను వీరు రెకమెండ్‌ చేస్తున్నారు. ట్రెండ్‌ చూస్తుంటే మార్కెట్‌లో ప్రస్తుత కరెక్షన్‌ పూర్తయినట్లేనని.. నవంబర్‌ సిరీస్‌లోనే నిఫ్టి కొత్త ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిని నిఫ్టి తాకే అవకాశముందని సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ అభిప్రాయపడుతున్నారు.