For Money

Business News

ఇవాళ రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ఇవాళ రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేస్తున్నారు. నిన్న నాన్‌ రీటైల్‌ ఇన్వెస్టర్లకు చేసిన ఆఫర్‌ భారీగా ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. అయితే వీరికి షేర్‌ను 7 శాతం డిస్కౌంట్‌కు ఆఫర్‌ చేయగా… నిన్న మార్కెట్‌లో షేర్‌ 7 క్షీణించింది. నాన్‌ రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేసిన ఫ్లోర్‌ ధర రూ. రూ.680. రూ. 3,800 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలయ్యాయి. ఫ్లోర్‌ ధర ప్రకారం ఓఎఫ్‌ఎస్‌ (4 కోట్ల షేర్లు) పరిమాణం విలువ రూ. 2,720 కోట్లు. ఈ ఆఫర్‌కు 10 శాతం షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేశారు. రిటైలర్ల ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌కు కూడా ఇదే ధరకు అంటే రూ.680కి ఆఫర్‌ చేస్తున్నారు. నిన్న ఈ షేర్‌ బీఎస్‌ఈలో 6.5 శాతంపైగా క్షీణించి రూ.687 వద్దకు తగ్గింది. మరి ఇవాళ ఏ మేరకు తగ్గుతుందో చూడాలి.