For Money

Business News

నష్టాల్లో SGX NIFTY

ఫెడ్‌ వడ్డీ రేట్ల చింత పోయింది. ఇపుడు కొంత సమస్య వచ్చింది. అదే అమెరికాలో మాంద్యం. ఫెడ్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ పావెల్ స్పీచ్‌ తరవాత అమెరికా మార్కెట్లకు మాంద్యం భయం పట్టుకుంది. నిన్న యూరో, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ల వడ్డీ రేట్ల పెంపు తరవాత ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రాత్రి నాస్‌డాక్‌ 3.23 శాతం నష్టపోగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2.49 శాతం నష్టపోయింది. డౌజోన్స్‌ 2.25 శాతం క్షీణించింది. రాత్రి అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104 దిగువకు వచ్చింది. క్రూడ్‌ 82 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కాని అమెరికా మార్కెట్లను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒక్క జపాన్‌ నిక్కీ, తైవాన్‌ మాత్రం 1.5 శాతం క్షీణించాయి. నిజానికి షాంఘై సూచీ గ్రీన్‌లో ఉంది. అలాగే హాంగ్‌సెంగ్ సూచీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు 60 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం ఆరంభంలో 100 పాయింట్ల నష్టంతో ఉండేది. సో.. నిఫ్టి ఇవాళ నష్టంతో ప్రారంభం కానుంది.