For Money

Business News

IPO: రూ. 5 లక్షల వరకు UPI పేమెంట్‌!

ఇక నుంచి పబ్లిక్‌ ఇష్యూ (IPO) ద్వారా ఐపీవోలు, క‌న్వర్టబిలిటీల్లో పెట్టుబ‌డులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుభవార్త చెప్పింది. ఐపీవోల్లో పెట్టుబ‌డులు పెట్టే రిటైల్ ఇన్వెస్ట‌ర్లు.. రూ.5 ల‌క్షల వ‌ర‌కు యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్ ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లించ‌వ‌చ్చున‌ని సెబీ పేర్కొంది. ఈ మేరకు ఓ స‌ర్క్యుల‌ర్‌లో జారీ చేసింది.
వివిధ సంస్థల్లో పెట్టుబ‌డులు పెట్టే రిటైల్ ఇన్వెస్ట‌ర్లు త‌మ సిండికేట్ మెంబ‌ర్‌, స్టాక్ బ్రోక‌ర్‌, షేర్ ట్రాన్స్‌ఫ‌ర్ ఏజంట్‌, రిజిస్ట్రార్‌ల‌కు అందజేసే ఐపీవో బిడ్ కం అప్లికేష‌న్‌లో వారి యూపీఐఐడీ వివ‌రాలు ఇవ్వాల‌ని సెబీ తెలిపింది. వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐపీవోల‌కు నూత‌న గైడ్‌లైన్స్ అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వెల్లడించింది. గ‌త డిసెంబ‌ర్‌లోనే ఐపీవోల్లో పెట్టుబ‌డులు పెట్టే వారు యూపీఐ ద్వారా జ‌రిపే చెల్లింపుల ప‌రిమితిని రూ.2 ల‌క్షల నుంచి రూ.5 ల‌క్షల‌కు పెంచుతూ నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్ణయం తీసుకుంది. సో.. ఎల్‌ఐసీ ఐపీఓకు సబ్‌స్క్రయిబ్‌ చేసే రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది శుభవార్తే.