నిరాశపర్చిన కెమ్‌ప్లాస్ట్ సన్మార్ లిస్టింగ్
ఐపీఓ షేర్ల లిస్టింగ్ ఇన్వెస్టర్లలో నిరాశకల్గిస్తోంది. వరుసగా షేర్లు నష్టాల్లో లిస్టవుతున్నాయి. తాజాగా స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ కెమ్‌ప్లాస్ట్ సన్మార్ షేర్ ఇవాళ ఏకంగా మూడు శాతం నష్టంతో లిస్టయింది. ఈ షేర్ ఇష్యూ ధర రూ. 541 కాగా, రూ. 525 వద్ద లిస్టయింది. కాని రూ. 521.60ని తాకిన తరవాత మిడ్ సెషన్‌లో నిఫ్టితో పాటు ఈ షేర్ కూడా మిడ్‌సెషన్ సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ రూ. 539.50ను తాకింది. కాని చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో రూ. 524.55 వద్ద ముగిసింది.
ఆప్టస్ వ్యాల్యూ పరవాలేదు…
ఇవాళ లిస్టయిన మరో షేర్ ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ కూడా ఆరు శాతం నష్టంతో రూ. 333 వద్ద లిస్టయింది. ఈ షేర్‌ను రూ. 353లకు ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. మిడ్ సెషన్ నుంచి ఈ షేర్‌లో కాస్త యాక్టివిటీ పెరిగింది. క్లోజింగ్ సమయంలో కాస్త మద్దతు రావడంతో ఈ షేర్ రూ. 356.50ని తాకింది. కాని క్లోజింగ్‌లో స్వల్ప లాభంతో రూ. 347.50 వద్ద ముగిసింది.