For Money

Business News

రీ సేల్‌ ధరలు ఢమాల్‌

ఐఫోన్‌ 16 యాపిల్‌ కంపెనీని పూర్తిగా నిరుత్సాహ పర్చింది. కొన్ని మార్కెట్లు మినహా… ప్రధాన మార్కెట్లలో ఈ ఫోన్‌ అమ్మకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. సాధారణంగా ఐఫోన్లకు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. ముఖ్యంగా హాంగ్‌కాంగ్, చైనాలలో డిమాండ్‌ కన్నా సరఫరా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది అమెరికా వంటి మార్కెట్లలో ప్రీమియంతో ఐఫోన్లను కొని చైనా, హాంగ్‌కాంగ్‌లలో అమ్ముతుంటారు. అయితే ఐఫోన్‌ 16 రీసేల్ ధరలు గణనీయంగా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మాంగ్‌కాగ్‌ వంటి మార్కెట్లలో చాలా మంది డీలర్లు ప్రీమియంకు ఐఫోన్లకు కొంటారు. అయితే ఈసారి విడుదలైన మూడు గంటల్లోనే ఈ ఫోన్లను కొనడం ఆపేశారు. సాధారణంగా ఇక్కడ కొత్త ఐఫోన్‌పై 3 శాతం నుంచి 34 శాతం ప్రీమించ చెల్లిస్తారు. అధిక ధరతో హాంగ్‌కాంగ్, చైనాలలో అమ్ముతారు. అయితే ఈసారి ఐఫోన్‌ విడులైన గంటలోనే ప్రీమియం కొత్త ఫోన్‌ ప్రీమియం నెగిటివ్‌లోకి వెళ్ళింది. తొలి అర గంటలో కొందరు 16 వాతం నుంచి 24 శాతం ప్రీమియంతో కొన్నారని.. కాని మరో 30 నిమిషాల తరవాత వీటిని కొనడం ఆపేశారని తెలుస్తోంది. త్వరలోనే అమెరికాలో ఏఐ సర్వీసులను యాపిల్‌ కంపెనీ ప్రారంభించనుంది. ఆ తరవాత ఐఫోన్లకు డిమాండ్‌ పెరుగుతుందేమో చూడాలి.