ఇవాళ ఓ ఛాన్స్ రావొచ్చు
నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు. సింగపూర్ నిఫ్టి క్రమంగా పెరుగుతోంది. 20 పాయింట్ల నుంచి ఇపుడు 80 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది. అయితే ఈ లాభాలన్నీ ఒక గంటలోగానే పోతాయని సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అన్నారు. ఈ గంటలో నిఫ్టి మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. మిడ్ క్యాప్ నిఫ్టి ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకోవచ్చని పేర్కొన్నారు. డే ట్రేడర్స్ అధిక స్థాయిలో అమ్మి దిగువ స్థాయిలో లాభాలు పొందవచ్చని అనూజ్ అన్నారు. అయితే మార్కెట్ పది నుంచి 11 గంటల మధ్యలో దిగువ స్థాయి నుంచి పెరిగే అవకాశముందని… ఇన్వెస్టర్లు ఆ స్థాయిలో 50 లేదా 40 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అన్నారు. మార్కెట్లో షార్ట్ రికవరీ వస్తే దాదాపు 300 పాయింట్ల లాభం వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. నిఫ్టి షార్ట్ పొజిషన్ష్ అధికంగా ఉన్నందున… షార్ట్ రికవరీకి ఛాన్స్ ఉందని ఆయన అన్నారు. లేకుంటే మరో 40 లేదా 50 పాయింట్ల నష్టానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిఫ్టి స్థాయి కన్నా ప్రైస్ యాక్షన్ చూడాలని అన్నారు. సో… ఓపెనింగ్‌లో కాకుండా… నిఫ్టి భారీగా పడినపుడు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ ఛాన్స్ 10 నుంచి 11 గంటల మధ్య రావొచ్చు.