INVESTING: రిలయన్స్, ఏషియన్ పెయింట్స్
మార్కెట్లో సూచీలకన్నా షేర్లపై ఇన్వెస్టర్లు అధిక శ్రద్ధ చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టి ఒక రేంజ్‌లోనే ఉంటుందని…. నికరంగా నిఫ్టిలో పెద్దగా మార్పులు ఉండవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు షేర్లపై దృష్టి సారిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్ సుభాష్ గంగాధరన్ రెండు షేర్లను ఇన్వెస్టర్ల కోసం సిఫారసు చేస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్…
గడచిన కొన్ని నెలల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ హయర్య టాప్స్, హయ్యర్ బాటమ్స్ నమోదు చేస్తోంది… ఈ షేర్లో త్వరలోనే అప్‌ట్రెండ్‌కు ఛాన్స్ ఉంది.ఈ షేర్‌కు రూ. 2305 వద్ద సపోర్ట్ ఉంది. ఈ షేర్ 20 రోజుల, 50 రోజులచలన సగటును ఛేదించడానికి సిద్ధంగా ఉంది. 14 రోజలు RSI కూడా పెరిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైలీ మూవ్మెంట్ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి.ఈ షేర్‌ను రూ. 2325 స్టాప్‌లాస్‌తో రూ. 2625 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చు.
ఏషియన్ పెయింట్స్
సూచీలు నష్టాల్లో ఉన్నా ఈ షేర్ గ్రీన్‌లో ఉంటోంది. ఇటీవలి ట్రేడింగ్ రేంజ్‌ను ఈ షేర్ ఛేదించింది. ట్రేడింగ్ పరిణామం కూడా సగటుకన్నా అధికంగా ఉంటోంది. 20 రోజుల SMA, 200 రోజుల EMAపైన ఈ షేర్ పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. టెక్నికల్‌గా చూస్తూ 14 రోజుల RSI కూడా బౌన్స్ బ్యాక్ అవుతోంది. ఇపుడు రైజింగ్ మూడ్‌లో ఉంది ఈ షేర్. ఈ సంకేతాలు ఈ షేర్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. మధ్యకాలీన ఈ షేర్ టెక్నికల్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ షేర్‌ను రూ. 3100 స్టాప్‌లాస్‌తో రూ. 3550 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చు.