ఈ 4 విద్యుత్ కంపెనీ షేర్లు కొనొచ్చు
విద్యుత్ పంపిణీ రంగంలో ఉన్న అయిదు కంపెనీలపై తన అభిప్రాయాన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టెక్ పేర్కొంది. టాటా పవర్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సీఈఎస్సీ కంపెనీల షేర్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. అలాగే టొరెంట్ పవర్ షేర్‌ను అమ్మొచ్చని సలహా ఇచ్చింది. విద్యుత్ కొరత 2024లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని, సంప్రదాయేతర రంగాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ఉన్నా… డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం చాలా ఉంటుందని ఇన్వెస్టెక్ అంచనా వేస్తోంది. రానున్న కొన్ని నెలల్లో ఈ కంపెనీలు కొత్త పీపీఏలు కుదుర్చకుంటాయని పేర్కొంది. పైగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల కారణంగా డిస్కామ్‌ల నష్టాలు తగ్గే అవకాశముందని పేర్కొంది. అంటే ప్రైవేట్ కంపెనీలకు డిస్కామ్‌ల నుంచి బకాయిలు సకాలంలో వసూలు అవుతాయన్నమాట. టాటా పవర్ షేర్ రూ. 215, ఎన్టీపీపీ షేర్ రూ. 200, పవర్ గ్రిడ్ రూ. 220, సీఈఎస్సీ కంపెనీ షేర్ రూ. 115కు పెరుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. అయితే టొరెంట్ పవర్‌ను రూ. 412 టార్గెట్‌తో అమ్మేయవచ్చని సలహా ఇచ్చింది.