సుకన్య సమృద్ధిపై వడ్డీ పెంపు
రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెంచింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు మొత్తాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఇవాళ సుకన్య సమృద్ధి యోజన, మూడేళ్ల కాలవ్యవధి కలిగిన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లను పెంచింది. మిగిలిన పథకాలపై మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. సుకన్య సమృద్ధి యోజనపై ఇపుడు 8 శాతం వడ్డీ ఇస్తుండగా.. దీన్ని 0.2 శాతం పెంచడంతో 8.2 శాతానికి చేరింది. అలాగే మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. కొత్త రేట్లు జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. పీపీఎఫ్ వడ్డీ రేట్లను మాత్రం మార్చలేదు.