అదనంగా పది వేల మందిని తీసుకుంటాం
ఐటీ రంగంలో ఉద్యోగుల జంపింగ్ బాగా పెరుగుతోంది. కొత్త టెక్నాలజీపై పట్టు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఐటీ రంగం అభివృద్ధి జోరు తగ్గుతోంది. దీంతో అధిక పేతో సీనియర్లను తీసుకోవడం కంటే ఫ్రెషర్స్‌పై అధిక శ్రద్ధ చూపిస్తున్నాయి. కంపెనీల పనితీరు బాగుందని అంటున్నా… టర్నోవల్‌లో పెద్ద మార్పు రావడం లేదు. ఫ్రెషర్స్‌పై కంపెనీలు దృష్టి సారించడానికి ఇదొక కారణం. వాస్తావానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోవాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే కంపెనీ వొదిలి వెళుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో అదనంగా మరో పది వేల మందిని తీసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. అంటే ఈ ఏడాది మొత్తం 45000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది.