For Money

Business News

ఇన్ఫోసిస్‌ చేతికి జర్మనీ కంపెనీ

జర్మనీకి చెందిన డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆడిటీని (Oddity) ఇన్ఫోసిస్‌ కంపెనీ టేకోవర్‌ చేయనుంది. డీల్ విలువ 5 కోట్ల యూరోలు అంటే సుమారు రూ.390 కోట్లు. మొత్తం నగదు డీల్‌. ఇన్ఫోసిస్‌లో భాగమయ్యాక… వాంగ్‌డూడీలో ఆడిటీ భాగమౌతుంది. సీటెల్‌, లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్క్‌, ప్రావిడెన్స్‌, హూస్టన్‌, లండన్‌లో ఉన్న స్టూడియో నెట్‌వర్క్‌కు ఒడిటీ సేవవలు అందిస్తుంది. అలాగే భారత్‌లోని అయిదు డిజైన్‌ హబ్‌లలో భాగమౌతుందని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. 2018లో వాంగ్‌డూడీని ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేసింది. ఆడిటీలో 300 మంది డిజిటల్‌ నిపుణులు ఉన్నారని, అతి పెద్ద స్వతంత్ర డిజిటల్‌ ఏజెన్సీలలో ఈ సంస్థ కూడా ఒకటిని ఇన్ఫోసిస్‌ పేర్కొంది.