For Money

Business News

ఇన్ఫోసిస్‌ పనితీరు సూపర్‌

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. అన్ని రంగాల్లోనూ కంపెనీ రాణించడమే గాక… గైడెన్స్‌ను కూడా పెంచింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 38,905 కోట్ల టర్నోవర్‌పై రూ.6,198 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించిన పోల్‌ పేర్కొంది. అయితే ఈ అంచనాలకు మించి రూ. 39,315 కోట్ల ఆదాయంపై రూ. 6,368 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. కంపెనీ మార్జిన్‌ కూడా 20.7 శాతం మించి 21.1 శాతం ఆర్జించింది. మున్ముందు కంపెనీ వృద్ధి రేటు 1 నుంచి 3 శాతం దాకా ఉంటుందని చెప్పిన కంపెనీ… ఇపుడు భవిష్యత్‌ వృద్ధిరేటు 3 నుంచి 4 శాతం ఉంటుందని పేర్కొంది. అయితే మార్జిన్‌ గైడెన్స్‌లో మాత్రం మార్పు చేయలేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 7 శాతంపైగా పెరిగింది.