For Money

Business News

ఇన్ఫోసిస్‌ లాభం అదుర్స్‌

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం పెరిగి రూ. 6,586 కోట్లకు చేరగా, ఆదాయం 20.2 శాతం వృద్ధితో రూ. 38,318 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌ త్రైమాసికంతో నికర లాభం రూ.6,021 కోట్లతో పోలిస్తే నికరలాభం 9.3 శాతం పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గైడెన్స్‌ను కూడా ఇన్ఫోసిస్ పెంచింది. ఆదాయం 16-16.5 శాతం పెరుగుతుందని పేర్కొంది. అంతర్జాతీయంగా మాంద్యం ప్రభావంతో కొన్ని విభాగాలకు ఇబ్బందులు ఉన్నా… బలమైన ఆర్డర్లు చేతిలో ఉండటం వల్లే ఆదాయ వృద్ధి అంచనాలను పెంచినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. అక్టోబరు- డిసెంబరులో వలసల రేటు గణనీయంగా తగ్గి 24.3 శాతానికి పరిమితమైంది. జులై- సెప్టెంబరులో వలసల శాతం 27.1 శాతం ఉండేది.