For Money

Business News

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లో జోష్‌

రాత్రి అమెరికా మార్కెట్లుఫుల్‌ జోష్‌లో ముగిశాయి. మున్ముందు వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడు ఉండదని ఫెడ్‌ రిజర్వ్‌ స్పష్టం చేయడంతో వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాలతో ముగిసింది. అమెరికాలో లిస్టయిన ఏడీఆర్‌ల విషయం చూస్తే.. ఇన్ఫోసిస్‌ 1.93 శాతం పెరగ్గా, విప్రో ఏడీఆర్‌ 0.93 శాతం పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.01 శాతం, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.15 శాతం నష్టంతో ముగిశాయి. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 1.68 శాతం నష్టపోయింది.డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ కూడా 0.97 శాతం నష్టంతో ముగిసింది.