4 శాతం తగ్గిన ఇన్ఫోసిస్ ADR
శుక్రవారం అమెరికా మార్కెట్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ నాలుగు శాతం నష్టంతో ముగిసింది. టీసీఎస్ ఫలితాలు తరవాత అమెరికా మార్కెట్లో భారత ఐటీ కంపెనీల సెంటిమెంట్ దెబ్బతింది. అమెరికా నాస్డాక్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 3.69 శాతం నష్టంతో 21.93 డాలర్ల వద్ద ముగిసింది. కాని అంతకుమునుపు 21.73 డాలర్లకు అంటే ఆరు శాతం వరకు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసిన తరవాత జరిగిన అనధికార ట్రేడింగ్లో కూడా ఇన్ఫోసిస్ ఏడీ 21.90 డాలర్ల వద్ద అంటే 4 శాతం నష్టంతో ముగిసింది. మరి మనదేశంలో ఎలా ట్రేడవుతుందో చూడాలి.