For Money

Business News

ఆఫర్‌ ధర రూ. 215… క్లోజింగ్‌ రూ.275

ట్రాక్టర్లు, క్రేన్లు, ఇతర వ్యవసాయ పరికరాలను తయారుచేసే ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ షేర్లు ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 275.49 వద్ద ముగిశాయి. ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 215లకు ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కంపెనీ షేర్లు 20 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.258 ప్రాంతంలో లిస్ట్‌ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 19.07 శాతం ప్రీమియంతో రూ.256 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తరవాత రూ. 287ల గరిష్ఠ స్థాయిని తాకింది. తరవాత రూ. 275.49 వద్ద ముగిసింది. అంటే ఆఫర్‌ ధర కంటే రూ. 60 లాభం ఇచ్చిందన్నమాట. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో 6.71 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. మార్కెట్‌ క్యాప్‌ రూ. 1323 కోట్లకు చేరింది. మార్కెట్‌ నుంచి రూ.250 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఇండోఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ఒక్కో షేరును రూ.204-215 శ్రేణితో ఆఫర్‌ చేసి… షేర్లను రూ. 215లకు కేటాయించింది.