For Money

Business News

ఇండిగో నష్టం 1,064 కోట్లు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండిగో కంపెనీ నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. జెట్‌ఫ్యూయల్‌ ధర పెరగడంతో పాటు డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడంతో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది. జూన్‌తో ముగిసి త్రైమాసికంలో కంపెనీ రూ.1,064 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.3,170 కోట్ల నుంచి రూ.13,019 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఖర్చులు రెట్టింపయి రూ.6,344 కోట్ల నుంచి రూ.14,083 కోట్లకు చేరడంతో కంపెనీ నష్టం ప్రకటించాల్సి వచ్చింది. కంపెనీ వ్యయంలో విమాన ఇంధనం కోసమే రూ.5,990 కోట్ల నిధులు వెచ్చించినట్లు కంపెనీ పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఏటీఎఫ్‌ కోసం కేటాయించిన రూ.1,215 కోట్లతో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లు పెరిగాయి.