For Money

Business News

ఇండిగో నష్టం రూ.1682 కోట్లు

ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కంపెనీ ఫలితాలు డల్‌గా ఉన్నాయి. విమనాలకు వాడే జెట్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు బాగా పెరగడంతో కంపెనీ పనితీరు దెబ్బతింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరనష్టం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ నష్టం రూ. 1,142 కోట్లు. సంస్థ ఆదాయం మాత్రం రూ.6,223 కోట్ల నుంచి 29 శాతం వృద్ధిచెంది రూ. 8,021 కోట్లకు చేరింది. ఏటీఎప్‌ ధర పెరుగుదలతో తమ ఇంధన వ్యయం ఏకంగా 68 శాతం పెరిగి రూ. 3,221 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ మొత్తం వ్యయాలు 32 శాతం పెరిగి రూ. 9,885 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. ఆపరేటింగ్‌ లాభాల మార్జిన్లు 10.4 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోయాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ సామర్థ్యం 150 శాతం మేర పెరుగుతుందని, పూర్తి ఏడాదిలో 55-60 శాతం పెరగవచ్చని కంపెనీ పేర్కొంది.