మార్కెట్లకు జీడీపీ జోష్
జీడీపీ వృద్ధి రేటు ఆర్థిక వేత్తల అంచనాలకు మించి పెరగడంతో… దాని ప్రభావం మార్కెట్లో కన్పించింది. స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ ధోరణి కూడా మార్కెట్‌కు కలిసి వచ్చింది. నిఫ్టీ 355 పాయింట్లు లాభంతో 22,338 వద్ద క్లోజ్ కాగా, సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడి 73,745 వద్ద ముగిసింది. చైనా మార్కెట్లో వస్తున్న ర్యాలీతో మెటల్ షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. ముఖ్యంగా టాటా స్టీల్ 7 శాతం దాకా పెరిగింది. నిఫ్టి టాప్ 50లో టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, జెఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్టీ, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణించాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సూచీలు ఇవాళ రెండు శాతంపైగా పెరిగాయి. ఈ సూచీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ర్యాలీ పరిమితంగా ఉంది.