అదరగొట్టిన ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ ప్రతి త్రైమాసికంలో తన పనితీరును మెరుగు పర్చుకుంటోంది. గత డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 690 కోట్లకు చేరింది. 2021 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ. 514 కోట్లు. బ్యాంక్ మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 11,482 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 4,395 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం కూడా 36 శాతం పెరిగి రూ. 1,556 కోట్లకు చేరింది.అయితే స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 9.04 శాతం నుంచి 9.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 2.35 శాతం నుంచి 2.72 శాతానికి పెరిగాయి.