ఇళ్ల ధరలు స్వల్పంగా తగ్గాయి
ఇళ్ల ధరల సూచీలో భారత్ ప్రపంచ 55 దేశాల్లో 54వ స్థానంలో ఉందని స్థిరాస్తి రంగానికి చెందిన అధ్యయన సంస్థ నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. భారత్‌లో ఇళ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో 0.5 శాతం తగ్గాయని పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 55 వ స్థానంలో ఉండగా.. రెండో త్రైమాసికంలో 54వ స్థానానికి చేరుకుందని పేర్కొంది. ఇళ్ల ధరలు అత్యధికంగా 29.2 శాతం టర్కీలో పెరిగాయని పేర్కొంది. 25.9శాతంతో న్యూజిలాండ్ రెండో స్థానం, 18.6శాతం వృద్ధితో అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్‌లో నివాస గృహాల ధరలు స్థిరంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మూడో త్రైమాసికంలో ఇళ్లకు గిరాకీ పెరగడంతో పాటు, ధరలు పెరిగే అవకాశముందని నైట్‌ఫ్రాంక్ పేర్కొంది.