For Money

Business News

కెనడా హై కమిషనర్‌ బహిష్కరణ

భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు బెడసి కొట్టాయి. ఓట్ల కోసం కెనడా సిక్కుల విషయంలో అనుసురిస్తున్న వైఖరి, కుట్రతో ఓ హత్య కేసులో భారత అధికారులను అనుమానితులుగా కెనడా పేర్కొనడంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలోని భారత హైకమిషనర్‌తో పాటు పలువురు అధికారులను వెనక్కి రప్పించింది. ఇదే సమయలో భారత్‌లో ఉన్న కెనడా అధికారులను బహిష్కరించింది. తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ట్రూడో సర్కారుపై విశ్వాసం లేదని భారత విదేశాంగశాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న కెనడా తాత్కాలిక హై కమిషనర్‌ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హై కమిషనర్ పాట్రిక్ హెబర్ట్, ప్రధాన కార్యదర్శులైన మేరీ కేథరీన్ జోలీ, లాన్ రాస్ డేవిడ్ ట్రైట్స్, ఆడమ్ జేమ్స్ చుయిప్కా, పౌలా ఓర్జులాలను దేశం నుంచి బహిష్కరించింది. వీరిని ఈనెల 19వ తేదీ అంటే వచ్చే శనివారం రాత్రి 11:59 గంటలలోపు లేదా అంతకంటే ముందుగానే భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

Leave a Reply