మార్కెట్‌పై ‘ఎగ్జిట్’ ప్రభావం?
పశ్చిమాసియా యుద్ధం పేరుతో విదేశీ ఇన్వెస్టర్లు తెగ అమ్మారు మన మార్కెట్‌లో. యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర పెరగడం, దరిమిలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, క్రూడ్ ఆధార కంపెనీల షేర్లు భారీగా పడటం సహజమే. కాని హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ వంటి దిగ్గజాలు నష్టపోవడానికి కారణం మాత్రం విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే. ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నించిన హర్యానాలో ఈసారి బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. దాదాపు అన్ని ప్రధాన సర్వే సంస్థలూ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంటున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో కూడా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి అధికారం దక్కే అవకాశం చాలా స్పష్టంగా కన్పిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 8న అంటే మంగళవారం వెల్లడికానున్నాయి. శుక్రవారం వాల్‌స్ట్రీట్, గిఫ్ట్ నిఫ్టి రెండూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్ ఒక శాతంపైగా లాభంతో క్లోజైంది. మరి సోమవారం ఐటీ షేర్లు నిఫ్టిని కాపాడుతాయా? లేదా ఎగ్జిట్ పోల్స్ ప్రభావం గట్టిగా ఉంటుందా అన్నది చూడాలి. మరోవైపు 25000 పుట్ కాల్ ఆప్షన్స్ ఓఐ భారీగా ఉండటం చూస్తుంటే… మార్కెట్ టెక్నికల్‌గా స్వల్పంగా కోలుకునే ఛాన్స్ అధికంగా కన్పిస్తోంది.