ఐకియా సిటీ స్టోర్లు.. ధరలు తగ్గింపు
స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా త్వరలోనే పలు నగరాల్లో సిటీ స్టోర్లను ప్రారంభించనుంది. హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో విశాలమైన ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు కాస్త చిన్నవిగా ఉంటాయని కంపెనీ అంటోంది. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో సిటీ స్టోర్లు రానున్నాయి. తమ స్టోర్లలో బాగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు.