For Money

Business News

మాకు వినోద్‌ రాయ్‌ వొద్దు…

మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌ను తమ బ్యాంకులో డైరెక్టర్‌గా తీసుకోవడానికి ఐడీఎఫ్‌సీ వాటాదారులు తిరస్కరించారు.ఈ ఏడాది మే నెలలో వాటాదారుల ఆమోదాన్ని పెండింగ్‌లో ఉంచుతూ వినోద్‌ రాయ్‌ను నాన్‌ ఇండిపెండెంట్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఐడీఎఫ్‌సీ నియమించింది. ఇవాళ కంపెనీ ఏజీఎం జరిగింది.ఈ ఓటింగ్‌లో వినోద్‌ రాయ్‌ నియామకాన్ని 62.3 శాతం ఇన్వెస్టర్లు వ్యతిరేకించగా కేవలం 37.7 శాతం మంది మాత్రమే ఆమోదించారు. మిగిలిన అన్ని తీర్మానాలకు వాటాదారులు ఓకే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాంక్స్‌ బోర్డ్ బ్యూరో కు వినోద్‌ రాయ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంకా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్ఆయంక్‌, ఎల్‌ఐసీల బోర్డులలో కూడా ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు.