అమ్మకానికి అశోకా హోటల్
ఢిల్లీ నగరం నడిబొడ్డున… ప్రధాని నివాసానికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న అశోకా హోటల్‌ను కేంద్రం అమ్మకానికి పెట్టింది. చాణక్యపురిలో 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్ 1956లో ప్రారంభమైంది. 550 అతిథి గృహాలు ఉన్న ఈ ప్రస్తుతం ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ (ITDC)లో ఉంది. ఈ హోటల్లో కేంద్రానికి 87.03 శాతం వాటా ఉంది. మిగిలింది ఇతర ప్రభుత్వ సంస్థల కుంది. అమ్మకానికి పెట్టిన అశోక్ హోటల్ విలువ రూ. 7,409 కోట్లుగా కేంద్రం పేర్కొంది. ఈ హోటల్‌తో పాటు దీనికి దగ్గర్లో ఉన్న సమ్రాట్ హోటల్‌ను కూడా ఐటీడీసీ అమ్మకానికి పెట్టింది. ఈ రెండు హోటల్స్‌తో పాటు ఐటీడీసీకి చెందిన మరో అయిదు ఆస్తులను కేంద్రం అమ్మనుంది.