77 శాతం పెరిగిన నికర లాభం….
ఐసీఐసీఐ బ్యాంక్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 4,616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 77.6 శాతం పెరిగింది. అయినా మార్కెట్ అంచనాలను అందుకో లేకపోయింది. సీఎన్‌బీసీ టీవీ 18 ఛానల్ నిర్వహించిన విశ్లేషకుల పోల్‌లో బ్యాంక్ నికర లాభం రూ. 4,821 కోట్లు ఉంటుందని భావించారు. కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ (ప్రావిజన్స్‌కు ముందు, పన్నులు, ట్రెజరీ ఆదాయం మినహాయించగా) 23 శాతం పెరిగి రూ. 8,606 కోట్లకు చేరింది. నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్ (నిమ్) మాత్రం అదిరిపోయింది. గత ఏడాదితో పోలిస్తే 17.8 శాతం పెరిగి రూ. 10,935.7 కోట్లకు చేరింది. ఈ విషయంలో బ్యాంక్ మార్కెట్ అంచనాలను మించింది.