రేపే మెగా లిస్టింగ్
దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించిన హ్యుందాయ్ ఇండియా షేర్లు రేపు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. మార్కెట్ నుంచి రూ. 27,870 కోట్ల సమీకరణకు ఒక్కో షేర్‌ను రూ. 1960 ధరతో కంపెనీ షేర్లను అలాట్ చేసిన విషయం తెలిసిందే. రేపు ఈ షేర్ ఏ ధర వద్ద లిస్ట్ అవుతుందనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్ నిన్న 3 శాతం నష్టంతో ఉండగా, ఇపుడు స్వల్ప ప్రీమియంతో ట్రేడవుతోంది. షేర్ రూ. 2005 లేదా రూ.2010 ప్రాంతంలో లిస్ట్ కావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగే పక్షంలో మరి అమ్మకాల ఒత్తిడి వస్తుందా లేదా కొనుగోళ్ళ ఆసక్తి వస్తుందా అన్నది చూడాలి. మెజారిటీ అనలిస్టులు ఈ కంపెనీ షేర్‌ను దీర్ఘకాలిక పెట్టుబడి కోసం రెకమెండ్ చేశారు. ఇపుడు మార్కెట్ వీక్‌గా ఉంది. షేర్ ధర మరింత పతనమయ్యే వరకు ఆగుతారా? ఇదే ఛాన్స్ అని కొంటారా అన్నది చూడాలి.