For Money

Business News

హైదరాబాద్‌ మెట్రో నష్టం రూ.1,767 కోట్లు

ఆదాయం దారుణంగా పడిపోవడంతో హైదరాబాద్‌ మెట్రో భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. గత మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ మెట్రోకు రూ. 1,767 కోట్ల నష్టం వచ్చింది. అంత క్రితం ఏడాదిలో కంపెనీ నష్టం రూ. 382 కోట్లు మాత్రమే. కరోనా కారణంగా కంపెనీ నష్టాలు భారీగా పెరిగాయి. గత ఏడాది మెట్రో రైల్‌ సర్వీసుతో పాటు ఇతర మార్గాల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 228 కోట్లు మాత్రమే. అంత క్రితం ఏడాది రూ. 598.20 కోట్లు ఉండేది. చార్జీల రూపంలో కాకుండా మాల్స్‌ ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది. దీంతో బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు, వడ్డీ భారం భారీగా పెరుగుతోంది.