For Money

Business News

హెచ్‌యూఎల్‌ చేతికి మినిమలిస్ట్‌?

స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేసే మినిమలిస్ట్ కంపెనీ టేకోవర్‌ కోసం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL) ప్రయత్నిస్తోంది. మినమలిస్ట్ టేకోవర్‌కు సంబంధించిన చర్చలు తుదిదశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇపుడు కంపెనీ టర్నోవర్‌కు పదిరెట్ల మేరకు సొమ్ము ఇచ్చేందుకు హెచ్‌యూఎల్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ ప్రస్తుత త్రైమాసికంలోనే కుదురుతుందని భావిస్తున్నారు. 2020లో ఏర్పాటు చేసిన మినిమలిస్ట్‌లో ఇది వరకు యూనిలివర్‌ వెంచర్స్‌, సీక్వొఇయా క్యాపిటల్‌ ఇండియా పెట్టుబడి పెట్టాయి. 2023-24తో రూ. 347 కోట్ల టర్నోవర్‌పై రూ. 10.8 కోట్ల నికర లాభాన్ని మినిమలిస్ట్‌ ఆర్జించింది.