ధరలు పెంచిన హిందుస్థాన్ లీవర్
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను మళ్ళీ పెంచాలని నిర్ణయించారు. క్రూడ్ ఆయిల్‌తో పాటు ఇతర ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తుల ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు అంటున్నాయి. ఇన్నాళ్ళు కొద్దిగా ధరలు పెంచామని, కొన్ని చోట్ల తమ మార్జిన్స్‌ను తగ్గించుకున్నామని కంపెనీ అధికారులు అంటున్నారు. రష్యా యుద్ధం కారణంగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో ఈసారి ధరలు పెంచాలని హిందుస్థాన్ లీవర్ నిర్ణయించింది. అత్యధికంగా లక్స్, పియర్స్ సబ్బుల ధరలు 5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరిగాయి.
సర్ఫ్ ఎక్సెల్ డిటర్జంట్ (కిలో) ధర : రూ. 130 నుంచి రూ. 134
సర్ఫ్ ఎక్సెల్ (500 గ్రాములు) : రూ. 66 నుంచి రూ. 68
సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ (కిలో) ధర : రూ. 218 నుంచి రూ. 229
వీల్ పౌండర్ ధర : రూ. 61 నుంచి 62
లక్స్ సోప్ మల్టి ప్యాక్ : రూ. 149 నుంచి రూ. 160
పియర్స్ సోప్ (75 గ్రాములు- మూడు సబ్బులు) : రూ. 129 నుంచి రూ. 135