For Money

Business News

మీ ట్యాక్స్‌ ఇలా లెక్క కట్టవచ్చు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ వేతన జీవులకు ఊరట నిచ్చే విషయాన్ని చెప్పారు. రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి జీరో ట్యాక్స్‌ అని చెప్పారు. అయితే ఇది పూర్తిగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి మాత్రమే. పాత విధానంలో ఎలాంటి మార్పులేదు. కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని దాటితే ట్యాక్స్‌ను టెలిస్కోపిక్‌ విధానంలో లెక్క గడగారు. అదెలాగంటే…
రూ. 12 లక్షల వరకు కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్‌. ఏడాదికి మీకు రూ. 12 లక్షల జీతం ఉంటే… మీరు పైసా కూడా పన్ను కట్టాల్సిన పనిలేదు. రూ. 12 లక్షల దాటితే మాత్రం… మీ ట్యాన్స్‌ను టెలిస్కోపిక్‌ (ఇది వరకు కరెంటు బిల్‌ లెక్క బెట్టేవారు ఇలా) విధానంలో కట్టాల్సి ఉంటుంది.
అంటే మీరు రూ. 16 లక్షల్లో రూ. 4 లక్షల వరకు పన్ను లేదు. 4 నుంచి 8 లక్షల వరకు రూ. 20,000 (5 శాతం చొప్పున) తరవాత 8 నుంచి 12 లక్షలకు రూ. 40000 (పది శాతం చొప్పున) మరో 4 లక్షలకు రూ. 60000 (15 శాతం చొప్పున) లెక్కిస్తారు. మొత్తం రూ. 1,20,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో రూ. 1,70,000 ట్యాక్స్‌ కడుతున్నారు. సో.. కొత్త ట్యాక్స్‌ విధానం వల్ల మీకు ఆదా అయ్యేది రూ. 50,000.
అదే మీ జీతం మొత్తం రూ. 13 లక్షలైతే చివరి లక్షకు 15 శాతం (రూ.15000) కట్టాలి. మొత్తం రూ. 75000 కట్టాలి.(20000 ప్లస్‌ 40000 ప్లస్‌ 15000).
ఇదంతా మీరు కొత్త పన్ను విధానంలో ఉంటేనే. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు.