కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న HRA?
ఇటీవల డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో హెచ్ఆర్ఏ (House Rent Allowance-HRA)ను కూడా పెంచే అవకాశముందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల డీఏ పెరగడంతో మొత్తం డీఏ 34 శాతానికి చేరింది. గత ఏడాది జులైలో HRAను పెంచిన కేంద్రం ఈసారి ఈ నెలలోనే పెంచుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. X కేటగిరి నగరాల్లోఉన్న ఉద్యోగులకు 3 శాతం, Y కేటగిరి నగరాల్లో ఉన్నవారికి 2 శాతం, Z కేటగిరి నగరాల్లో ఉన్న ఉద్యోగులకు ఒక శాతం చొప్పున HRA పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో అత్యధిక పెంపుదలను లెక్కలోకి తీసుకుంటే HRA 27 శాతం నుంచి 30 శాతానికి పెరుగుతుంది. మొత్తం మూడు కేటగిరీలుగా కేంద్రం HRA ఇస్తోంది. X కేటగిరి నగరాల్లో HRA బేసిక్ జీతంలో 27 శావతం, Y కేటగిరి నగరాల్లో 18 నుంచి 20 శాతం, Z కేటగిరి నగరాల్లో బేసిక్ జీతంలో 9 నుంచి 10 శాతం HRA ఇస్తోంది ప్రభుత్వం.