టెక్ షేర్లలో భారీ అమ్మకాలు
సూచీలు పైకి.. షేర్లు దిగువకు. ఇప్పటి వరకు మార్కెట్లో అంతర్గతంగా జరుగుతోంది ఇదే. ఇపుడు సూచీలలో కూడా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లో ఐటీ, టెక్ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. నాస్డాక్ ఏకంగా 2.51 శాతం నష్టపోయింది. ఇదే కారణంతో ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.42 శాతం క్షీణించింది. ఇక డౌజోన్స్ ఒక్కటే 0.49 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. అమెరికా మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై కన్పిస్తోంది. జపాన్ నిక్కీ 1.75 శాతం నష్టంతో,హాంగ్‌సెంగ్ 0.84 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్ల నష్టాలు అరశాతం లోపే ఉన్నాయి. డాలర్ క్షీణించడంత మన మార్కెట్లో ఐటీ షేర్లపై ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. సింగపూర్ నిఫ్టి 75 పాయింట్ల నష్టంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది.