IB హౌసింగ్‌లో భారీ అమ్మకాలు
ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్ ఎఫ్ అండ్ ఓ బ్యాన్ నుంచి బయటకి వచ్చింది. ఇదే ఛాన్స్‌గా ఈ షేర్లో ఇవాళ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 5 శాతం వరకు క్షీణించిన ఈ షేర్‌ను అమ్మేయాల్సిందిగా చాలా బ్రోకరేజ్ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి. రూ. 243 వద్ద ట్రేడవుతున్న ఈ షేర్ టార్గెట్‌ను రూ. 175గా ఇస్తున్నారు. ఇక మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి జోరుగా ఉంది. మైండ్ ట్రీ, ఎంఫసిస్, కోఫోర్జ్ అంటే మిడ్ క్యాప్ ఐటీ షేర్లు మాత్రమే లాభాల్లోఉన్నాయి. జీ ఎంటర్టైన్మెంట్, భెట్, బీఈఎల్, కమన్స్ ఇండియా, టీవీఎస్ మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టి విషయానికొస్తే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. అన్నీ ఐటీ షేర్లే. నష్టపోయిన షేర్లలో టైటాన్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూని లివర్, ఎం అండ్ ఎం, మారుతీ ఉన్నాయి.