For Money

Business News

నాస్‌డాక్‌లో నష్టాల నెత్తురే…

ఈ పతనం…ఐటీ, టెక్‌ కంపెనీల ఇన్వెస్టర్లు కలలో కూడా ఊహించలేదేమో. ఈ ఏడాది ఇప్పటికే నాస్‌డాక్‌ పది శాతం పడింది. ఉదయం అమెరికా ఫ్యూచర్స్‌ దాదాపు ఒకశాతం గ్రీన్‌లో ఉన్నాయి. కాని మిడ్‌ సెషన్‌కు నష్టాలు తగ్గుముఖం పట్టాయి. యూరో మార్కెట్లలో రక్తపాత తరవాత లాభాలన్నీ పోయి… ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి వచ్చాయి. కాని అసలు సినిమా వాల్‌స్ట్రీట్‌ ప్రారంభమైన తరవాత మొదలైంది. నాస్‌ డాక్ ఏకంగా మూడు శాతం పడింది. అంటే ఈ ఏడాదిలో 13 శాతంపైగా పడినట్లు. నాస్‌డాక్ ప్రభావం కచ్చితంగా ఎస్‌ అండ్‌ పీ 500పై ఉంటుంది. ఎందుకంటే ఆ సూచీలో కూడా ఐటీ షేర్లు ఉంటాయి. ఆ సూచీ కూడా 2.4 శాతం క్షీణించింది. పూర్తిగా ఎకానమీ షేర్లకు పరిమితమయ్యే డౌజోన్స్‌లో కూడా అమ్మకాల హోరు ఏ స్థాయిలో ఉందంటే సూచీ దాదాపు 2 శాతం క్షీణించింది. యూరో మార్కెట్లలో పరిస్థితి ఎంత భయానకంగా మారిందంటే సుమారుపాటి దేశాల సూచీలన్నీ మూడు శాతంపైగా పతనమయ్యాయి. ఫెడ్‌ నిర్ణయం ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌లో ఉన్న మార్కెట్లకు ఉక్రెయిన్‌ గొడవ పెద్ద తలనొప్పిగా మారింది. డాలర్ అమాంతంగా 0.45 శాతం పెరగడంతో మెటల్స్‌ మరింత క్షీణించాయిన. క్రూడ్‌ ఆయిల్‌ కూడా రెండు శాతంపైగా క్షీణించింది. దీంతో ఎనర్జీ షేర్లలో ఒత్తిడి వస్తోంది. వెరశి మార్కెట్లో భయానక వాతావరణం నెలకొంది. టెస్లా ఇవాళ కూడా భారీగా క్షీణించింది. నెట్‌ఫ్లిక్స్‌ మరో 8 శాతం తగ్గింది. మిగిలిన ఐటీ షేర్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లు ఎలా ముగుస్తాయో చూడాలి మరి.