For Money

Business News

వైరస్‌ దెబ్బకు ఈ షేర్లు పెరిగాయి

కరోనా సమయంలో భారీ లాభాలతో ట్రేడైన హెల్త్‌కేర్‌, టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు ఇవాళ డిమాండ్ కన్పించింది. ఇవాళ నిఫ్టితో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలతో క్లోజ్‌ కాగా… హాస్పిటల్స్‌తో పాటు డయాగ్నస్టిక్స్‌ రంగానికి చెందిన షేర్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. అపోలో హాస్పిటల్స్, డాక్టర్‌ లాల్‌పత్‌ ల్యాబ్స్‌, కిమ్స్‌, కృష్ణా డయాగ్నస్టిక్స్‌, రెయిన్‌బో హాస్పిటల్స్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌, నారాయణ హృదయాలయ, సురక్ష డయాగ్నస్టిక్స్‌, థైరోకేర్‌, విజయా డయాగ్నస్టిక్స్‌ ఉంది. వీటిలో థైరోకేర్‌ఖ టెక్నాలజీస్‌ షేర్‌ ఏకంగా 11 శాతంపైగా పెరగడం విశేషం.