వడ్డీ రేట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
నెలలో రెండోసారి వడ్డీ రేటును పెంచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్. రుణాలపై వడ్డీ రేట్లు మే7వ తేదీన బ్యాంక్ పెంచింది. అపుడు 0.25 శాతం మేర (MCLR -marginal cost of funds-based lending rate) పెంచగా, ఇవాళ ఇదే రేటును మరో 0.35 శాతం పెంచింది. అంటే నెలలో మొత్తం 0.60 శాతం వడ్డీని పెంచిందన్నమాట. ఇపుడు బ్యాంక్ రుణాలపై MCLR 7.5 శాతానికి చేరింది. అదే రు నెలల రుణాలకైతే 7.7 శాతం, ఏడాదికైతే వడ్డీ రేట్లు 7.85 శాతానికి చేరింది. చాలా వరకు కన్జూమర్ రుణాలు ఇదే రేటుకు తీసుకుంటారు. రెండేళ్ళ రుణాలపై 7.95 శాతం, మూడేళ్ళ రుణంపై రూ. 8.05 శాతం వడ్డీని వసూలు చేస్తారు. పెంచిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో గృహ, వాహన, పర్సనల్తో పాటు ఇతర రుణాలపై వడ్డీ పెరుగుతుంది. అంటే ఆటోమేటిగ్గా ఈఎంఐ కూడా పెరుగనుంది.