HDFC బ్యాంక్ సంక్షోభం
HDFC బ్యాంక్ ఛైర్మన్ అతను చక్రవర్తి రాజీనామాతో బ్యాంకింగ్ రంగంలో కలకలం చెలరేగింది. బ్యాంక్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతను చక్రవర్తి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆర్బీఐ ఆమోదించింది. ప్రస్తుతం వైస్ ఛైర్మన్‌గా ఉన్న కేకి మిస్త్రిని బ్యాంక్ తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా ఆర్బీఐ నియమించింది. తన రాజీనామా పత్రంలో బ్యాంక్ పనితీరుపై అతను చక్రవర్తి సంచలన ఆరోపణలు చేశారు. రెండేళ్ళుగా బ్యాంక్ పద్ధతులపై సంతృప్తిగా లేదని పేర్కొన్నారు. బ్యాంక్ విధానాలు తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేవని అతను చక్రవర్తి వెల్లడించారు. బ్యాంకు పాటిస్తున్న కొన్ని విధానాల్లో నీతి నిజాయితీ కొరవడిందని ఆయన ఆరోపించారు.
తన రాజీనామాకు ఏకైక కారణం అదేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతను 2021లో బ్యాంకులో చేరారు. అతను రాజీనామాతో రాత్రి అమెరికా మార్కెట్లలో బ్యాంక్ ఏడీఆర్ 7 శాతం నష్టంతో ముగిసింది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్‌లో రెండో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది. ఇంత పెద్ద బ్యాంక్‌పై ఇపుడు ఆరోపణలు రావడంతో మార్కెట్ ప్రతికూలంగా స్పందించనుంది. పైగా రెండేళ్ళుగా బ్యాంకు పనితీరు సంతృప్తికరంగా లేకుంటే… అతను చక్రవర్తి ఎందుకు మిన్నకుండి పోయారనే ప్రశ్న ఇపుడు తలెత్తుతోంది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు కాని, అవకతవకలు జరిగాయని ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. బ్యాంకు పనితీరులో నీతి నిజాయితీ, విలువలు లేని పక్షంలో ఆయన ఆర్బీఐకి ఎప్పటికపుడు ఎందుకు చెప్పలేదనే ప్రశ్న మార్కెట్‌లో వినిపిస్తోంది.
