నికర లాభంలో 16.4 శాతం వృద్ది
హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 3700 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ ఆర్జించిన రూ. 3306 కోట్లతో పోలిస్తే ఈ నికర లాభం 16.4 శాతం ఎక్కువ. సంస్థ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా 14 శాతం వృద్ధితో రూ. 4027 కోట్ల నుంచి రూ. 4358 కోట్లకు చేరింది. షేర్‌కు రూ.30 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. మార్కెట్ నుంచి రూ. 1.25 లక్షల కోట్లను డిబెంచర్ల జారీ ద్వారా సమీకరించాలన్న ప్రతిపాదనకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఇంటి రుణాలకు భారీ డిమాండ్ ఉందని సంస్థ పేర్కొంది. తమ రుణ మొత్తం 15 శాతం పెరిగి రూ. 5.55 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.