For Money

Business News

HDB: లిస్టింగ్‌ నేడు

ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద ఐపీఓలలో ఒకటైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ షేర్లు ఇవాళ లిస్టింగ్ కానున్నాయి. రూ. 12,500 కోట్ల సమీకరణకు గత వారం ఈ కంపెనీ ప్రైమరీ మార్కెట్‌కు వచ్చింది. ఈ ఇష్యూ 16.69 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన ఇష్యూ కావడంతో ఇవాళ ప్రీమియంతో ఈ షేర్లు లిస్ట్‌ అయ్యే అవకాశముంది. ఇవాళ సంభవ్‌ స్టీల్‌ షేర్లు కూడా లిస్ట్‌ కానున్నాయి. అయితే ఇష్యూకు అంతంత మాత్రమే ఆదరణ లభించడంతో ప్రీమియంపై అనుమానంగా ఉంది. ఈ కంపెనీ రూ. 82 ధరకు షేర్లు ఆఫర్‌ చేసింది.