మరో జాక్‌పాట్ పబ్లిక్ ఇష్యూ
డిసెంబర్ లేదా వచ్చే మార్చిలోగా భారత క్యాపిటల్ మార్కెట్‌లో మరో బాహుబలి పబ్లిక్ ఆఫర్ రానుంది. హెచ్‌డీఎఫ్‌షీ బ్యాంక్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ నుంచి పబ్లిక్ ఆఫర్ రానుంది. ఈ కంపెనీలో మాతృసంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు 94.64 శాతం వాటా ఉంది. ఇందులో 10 నుంచి 15 శాతం వాటాను విక్రయించాలని హెచ్‌డీబీ ఫైనాన్షియల్ భావిస్తోంది. ఈ పబ్లిక్ ఆఫర్‌లో భాగంగా తన వాటాలో కొంత భాగాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విక్రయించనుంది. మరికొంత కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించదలిచింది. ఈ ఇష్యూ సమయానికి హెచ్‌బీడీ ఫైనాన్స్ విలువ 900 లేదా 1000 కోట్ల డాలర్లు అంటే రూ. 87,000 కోట్లుగా భావిస్తున్నారు. అంటే మార్కెట్ నుంచి రూ. 7000 కోట్లు లేదా రూ. 8700 కోట్లు సమీకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భావిస్తోంది. గత రెండు నెలలు ఎన్‌బీఎఫ్‌సీలోకి కొత్త ఇన్వెస్టర్లను తేవాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రయత్నించింది. అయితే ఇపుడు పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధులు సమీకరించాలని బ్యాంక్ భావిస్తోంది. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.