For Money

Business News

ఫలితాలు ఓకే

టీసీఎస్‌ నిరాశజనక ఫలితాల తరవాత వచ్చిన హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫలితాలు మార్కెట్‌కు మంచి కిక్‌ ఇచ్చేలా ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరు అటు టర్నోవర్‌లో, ఇటు నికర లాభంలోనూ అంచనాలను మంచింది. ఈ త్రైమాసికంలో కంపెనీలో రూ. 4,235 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని నికర లాభం రూ. 3832 కోట్లతో పోలిస్తే 10.5 శాతం పెరిగింది. అలాగే టర్నోవర్‌ కూడా 8.2 శాతం పెరిగి రూ. 26,675 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రూ. 28,550 కోట్ల టర్నోవర్‌పై రూ. 4,120 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని ఈటీ నౌ ఛానల్‌ నిర్వహించిన సర్వేలో అనలిస్టులు అంచనా వేశారు. అదే గత జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 0.5 శాతం క్షీణించింది. అదే విధంగా టర్నోవర్‌ 2.9 శాతం పెరిగింది. ఈ లెక్కన గత ఏడాదితో పోలిస్తే గణాంకాలు బాగున్నా… అంతకుమునుపు త్రైమాసికంతో పోలిస్తే … కంపెనీ ఫలితాలు నిలకడగా ఉన్నాయి. ఇక డివిడెండ్‌ విషయానికొస్తే కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 12ల డివిడెండ్‌ ప్రకటించింది. కంపెనీ గైడెన్స్‌ ప్రోత్సాహకరంగా ఉంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ టెక్‌ మూడోది.

Leave a Reply