ప్రీమియంతో లిస్టయిన హైదరాబాద్ కంపెనీ
హరిఓం పైప్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 44 శాతం ప్రీమియంతో లిస్టయింది. ఈ కంపెనీ ఇటీవల పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 153లకు షేర్లను ఆఫర్ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ 44 ప్రీమియంతో రూ.220 వద్ద లిస్టయింది. స్టీల్ పైప్స్ వ్యాపారానికి మంచి భవిష్యత్తు ఉండటం, ఇపుడు స్టీల్ పరిశ్రమ సెంటిమెంట్ బాగుండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొంటున్నారు. ఈ షేర్ కేవలం దీర్ఘ కాలిక ఇన్వెస్టర్లకు మాత్రమేనని… ఈ కంపెనీ షేర్లు అలాటైన ఇన్వెస్టర్లు రూ. 195 స్టాప్‌లాస్‌తో ఉంచుకోవాలని అనలిస్టలు అంటున్నారు. అంటే ఈ ధర దిగువకు వెళితే ఈ షేర్‌లో ఒత్తిడి వచ్చే అవకాశముంది.