ఇజ్రాయిల్‌పై హమస్ దాడి
చెప్పినట్లే ఇజ్రాయిల్‌పై హమస్ భారీ ఎత్తున విరుచుకుపడింది. ఇజ్రాయిల్‌లోని పలు ఎయిర్ బేస్‌లపై క్షిపణులతో దాడి చేసింది. గత కొన్ని నెలల్లో హమస్ ఈ స్థాయిలో దాడి చేయడం ఇదే మొదటిసారి. లాంగ్ రేంజ్ మిస్సెయిల్స్ను హమస్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడుల వల్ల ఎంత మేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే అంశాలపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల ఇజ్రాయిల్ గాజాసిటీలోని రఫాపై పదే పదే దాడులు చేసింది. ఇదే ప్రాంతం నుంచి హమస్ క్షిపణులతో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడులతో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశముంది. గత దాడుల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల నుంచి94 డాలర్ల వరకు పెరిగింది. తరవాత క్షీణిస్తూ వచ్చింది. గత వారం 81 డాలర్ల దిగువకు వచ్చి… నిన్న రాత్రి 81 డాలర్ల ఎగువన ముగిసింది. హమస్దాడులకు స్టాక్ మార్కెట్‌తో పాటు ఆయిల్ మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.