For Money

Business News

రూ. 2000 లోపు పంపినా జీఎస్టీ?

పేటీఎం, జీ పే, గూగుల్‌ పే వంటి పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ ద్వారా పంపిన మొత్తం రూ.2000 లోపు ఉన్నా జీఎస్టీ విదించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలిస్తోంది. రేపు జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశముంది. ఇలాంటి చెల్లింపులపై18 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన ఉంది. అంటే యాప్‌ ద్వారా రూ. 2000 లోపు పంపే మొత్తాలపై కూడా యాప్‌ అగ్రిటేర్స్‌ వసూలు చేసే ఫీజుపై జీఎస్టీ 18 శాతం పన్ను విధిస్తారన్నమాట. అంటే జీ పే వంటి పేమెంట్‌ అగ్రిగేటర్‌ ద్వారా రూ. 2000 పంపితే.. జీ పే గనుక రూ. 20 చార్జి వసూలు చేస్తే… దానిపై కంపెనీ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి ప్రతిపాదన అమల్లోకి వస్తే కంపెనీ జీఎప్టీ భారాన్ని కూడా కస్టమర్‌ నుంచి వసూలు చేస్తాయి.2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసినపుడు కేంద్ర ప్రభుత్వం రూ. 2000 లోపు లావాదేవీలపై సర్వీస్‌ ట్యాక్స్‌ను మినహాయించింది. ప్రస్తుతం రూ.2000 లోపు లావాదేవీలపై అగ్రిగేటర్లు చార్జీ వసూలు చేస్తున్నా… దానిపై జీఎస్టీ లేదు. తాజా ప్రతిపాదనపై రేపు జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Leave a Reply