జీఎస్టీ మంత్రుల కమిటీ భేటీ ఎల్లుండి
జీఎస్టీలో పన్నుల స్లాబుల హేతుబద్ధీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 17న సమావేశం కానుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల చివరలో సమావేశం అవుతుంది. ప్రస్తుతం జీఎస్టీలో అమలు చేస్తున్న పన్నుల స్లాబుల్లో మార్పులు, స్లాబు రేట్ల సవరించడంపై మంత్రుల కమిటీ ఎల్లుండి చర్చించనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కర్ణాటక ముఖ్యమంత్రి బస్వారాజ్ బొమ్మై అధ్యక్షతన వివిధ రాష్ట్రాలకు చెందిన 7 గురు మంత్రులతో బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలతో పాటు పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన అభ్యర్థనలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇపుడున్న స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా రికమండ్ చేస్తారు.