రూ. 240 కోట్లతో షేర్ల బైబ్యాక్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికంలో రూ.128 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.120 కోట్ల నికర లాభం ప్రకటించింది. నికర లాభంలో పెద్ద మార్పు లేకున్నా… కంపెనీ ఆదాయం 20 శాతం పెరిగి రూ.850 కోట్ల నుంచి రూ.1,020 కోట్లకు చేరింది. 62 లక్షల ఈక్విటీ షేర్లను బై బ్యాక్ చేయాలన్న ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఒక్కో షేరుకు రూ.400 చొప్పున కొంటారు. దీని కోసం రూ.250 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.