బంగారం దిగుమతిపై సుంకం తగ్గింపు?
దేశీయంగా స్మగ్లింగ్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. బంగారం దిగుమతిపై సుంకం అధికంగా ఉండటంతో స్మగ్లింగ్ బాగా పెరిగింది. గత ఏడాది జులైలో బంగారంపై బేసిక్ డ్యూటీని కేంద్రం ఏడున్నర శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. కేంద్రం నిర్ణయంతో స్మగ్లింగ్ పెరిగి… బ్యాంకుల బంగారం బిజినెస్ బాగా తగ్గింది. బేసిక్ దిగుమతి సుంకంతో పాటు బంగారంపై రెండున్నర శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్‌తో పాటు ఇతర పన్నులను కేంద్రం విధిస్తోంది. దీంతో బ్లాక్‌లో చాలా చౌవకగా బంగారం లభిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయం దెబ్బతింటోంది. ఇపుడు బంగారం దిగుమతిపై 18.45 శాతం సుంకం విధిస్తున్నారు. దీన్ని దీన్ని 12.5 శాతానికి తగ్గించవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ రాసింది.